30 రోజులు జైలులో ఉంటే పదవి ఊడినట్లేనా?.. ప్రజాప్రతినిధుల అనర్హత బిల్లుపై కీలక భేటీ
- తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ప్రజాప్రతినిధుల అనర్హతపై కీలక బిల్లు
- 30 రోజులకు పైగా జైల్లో ఉంటే పదవిని కోల్పోయేలా నిబంధన
- రాజ్యాంగ సవరణ బిల్లుపై సమావేశమైన పార్లమెంటరీ కమిటీ
- తెలంగాణ సహా పలు రాష్ట్రాలు, సంస్థల నుంచి అభిప్రాయాల సేకరణ
తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టయిన ప్రజాప్రతినిధుల పదవిని రద్దు చేసే కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ‘130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025’పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులతో పాటు పలు విశ్వవిద్యాలయాల నిపుణులు పాల్గొన్నారు.
ఈ బిల్లు ప్రకారం.. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసులో అరెస్ట్ అయిన ప్రజాప్రతినిధి 30 రోజుల పాటు జైలులోనే ఉంటే.. 31వ రోజున తన పదవిని కోల్పోతారు. ఈ నిబంధన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులతో సహా అందరికీ వర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హాజరై బిల్లులోని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు సూచనలు చేశారు.
గతేడాది ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాజకీయ కక్ష సాధింపులకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని విమర్శలు రావడంతో దీనిని జేపీసీ పరిశీలనకు పంపారు. ప్రస్తుతం కమిటీ వివిధ రాష్ట్రాలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఏయే సెక్షన్ల కింద నమోదైన కేసులకు ఈ నిబంధన వర్తింపజేయాలి, 30 రోజుల గడువులో ఎలాంటి మినహాయింపులు ఇవ్వాలనే అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది.